రాష్ట్ర విభజన ఆంధ్రావారికి ఇష్టం లేకున్నా కూడా తెలంగాణలో ఓట్లు రాలుతాయనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ ఏపీని పక్కకు పెట్టి రాష్ట్రంను విడదీసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం చేసింది అంటూ కాంగ్రెస్‌కు కనీసం ఒక్క సీటును కూడా ఏపీ ప్రజలు ఇచ్చింది లేదు. కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. అంతటి దారుణ పరిస్థితి ఇప్పుడు బీజేపీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీకి ఇవ్వాల్సిన అదనపు నిధులు ఇవ్వక పోవడంతో పాటు, అన్ని రాష్ట్రాలకు ఇస్తున్న మేరకు కూడా నిధులు ఇవ్వకుండా ఏపీపై తీవ్ర స్థాయిలో వివక్షను బీజేపీ చూపిస్తుంది.
ప్రస్తుతం ఏపీలో బీజేపీకి పెద్దగా పట్టులేదు. ఎంతగా నిధులు కేటాయించినా, ఎంతగా ప్రాజెక్ట్‌లు ఇచ్చినా కూడా ఏపీలో బీజేపీ ఓటు బ్యాంకు మాత్రం పెరగదనే నిర్ణయానికి వచ్చిన బీజేపీ నాయకత్వం కేటాయింపులు చేయవద్దని ఫిక్స్ అయ్యింది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితం తప్పదని రాజకీ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కవని, బీజేపీ ఇకనైనా మారాలి. బీజేపీని తూడ్చిపెట్టేలా అధినాయకత్వం చేస్తుందని కొందరు రాష్ట్ర నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.