రివ్యూ : గాయత్రి – ఫ్యామిలీ ఆడియన్స్ కోసం

టైటిల్ : గాయత్రి (2018)
స్టార్ కాస్ట్ : మోహన్ బాబు , విష్ణు , శ్రీయ , అనసూయ తదితరులు…
దర్శకత్వం : మదన్
నిర్మాతలు: మోహన్ బాబు
మ్యూజిక్ : థమన్
విడుదల తేది : ఫిబ్రవరి 09, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : గాయత్రి – ఫ్యామిలీ ఆడియన్స్ కోసం

డా. మోహన్ బాబు చాల రోజుల తర్వాత ద్విపాత్రాభినయం చేసిన సినిమా గాయత్రి. పెళ్లైన కొత్తలో ఫేమ్ మదన్ ఈ మూవీ ని డైరెక్ట్ చేయగా , విష్ణు , శ్రీయ , అనసూయ ముఖ్య పాత్రల్లో కనిపించడం , ట్రైలర్స్ సైతం ఆకట్టుకోవడం తో మంచి అంచనాల మధ్య ఈరోజు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

దాసరి శివాజీ(మోహన్‌బాబు) చిన్నప్పుడే తన కూతురు (గాయత్రి) తప్పిపోవడం తో గత 25 ఏళ్లుగా ఆమె కోసం వెతుకుతుంటాడు. ఇలా ఓ పక్క వెతుకుతూనే మరోపక్క ఓ అనాధ ఆశ్రమాన్ని నడుపుతుంటాడు..ఆలా ఓ రోజు గాయత్రి జడ తెలుస్తుంది. ఇక ఆమెను కలుసుకోవాలని అనుకుంటున్న సమయం లో శివాజీ ని , గాయత్రి పటేల్ (మోహన్ బాబు ) కిడ్నాప్ చేస్తాడు. అసలు శివాజీ ని గాయత్రి
పటేల్ ఎందుకు కిడ్నాప్ చేస్తాడు..? అసలు శివాజీ కి , గాయత్రి పటేల్ కు సంబంధం ఏంటి ..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ :

* మోహన్ బాబు

* డైలాగ్స్

* విష్ణు , శ్రీయ యాక్టింగ్

మైనస్ :

* కామెడీ లేకపోవడం

* సాగదీత సన్నివేశాలు

* ఫస్ట్ హాఫ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* మోహన్ బాబు ద్విపాత్రాభినయం లో అదరగొట్టాడు..లుక్ లో కూడా చాల జాగ్రత్తలు తీసుకొని కొత్తగా కనిపించాడు. మరోసారి తనదయిన స్టయిల్ లో డైలాగ్స్ పలికించి అభిమానుల చేత ఈలలు వేయించాడు. కుర్చీలో కూర్చుని చేసిన ఫైట్‌, మార్కెట్‌లో జ‌రిగిన ఫైట్‌, క్లైమాక్స్ ఫైట్ల‌ను కంపోజ్ చేసిన తీరు బావుంది.

* ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో విష్ణు, శ్రియ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఆకట్టుకున్నాయి. విష్ణు కాసేపే అనిపించినా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

* అలీ, బ్ర‌హ్మానందం కామెడీ అసలు వర్క్ అవుట్ అవ్వలేదు..నవ్వు పక్కనపెడితే బోర్ కొట్టించింది.

* జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో యాంకర్ అనసూయ కనిపించింది.

* కోట శ్రీనివాస‌రావు, శివ‌ప్ర‌సాద్, శేఖ‌ర్ పాత్ర‌లో రాజా రవీంద్ర‌, మినిస్ట‌ర్‌గా పృథ్వి, లాయ‌ర్‌గా పోసాని, జైల‌ర్‌గా నాగినీడు, పోలీస్‌గా స‌త్యం రాజేశ్‌ త‌మ త‌మ పాత్ర‌ల్లో పర్వాలేదు అనిపించారు.

సాంకేతిక విభాగం :

* తమన్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నేపధ్య సంగీతం కూడా యావరేజ్ గా ఉంది. డైమండ్ రత్న బాబు డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. కథ మాత్రం చాల సెంటిమెంట్ గా సాగింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు కాస్త నచ్చవచ్చు.

* సర్వేష్‌ మురారి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది.

* ఎంఆర్ వర్మ ఎడిటింగ్ లో చాల లోపలే కనిపించాయి. చాల సన్నివేశాలు బాగా సాగదీసినట్లు అనిపించాయి.

* కనల్ కణ్ణన్ ఫైట్స్ బాగున్నాయి

* మదన్ దర్శకత్వం విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం కేవలం పాత్రల పరిచయాలతో సరిపెట్టాడు. ఇక సెకండ్ హాఫ్ లోనే అసలు కథ ఏంటి అనేది చూపించాడు. కథ లో సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి సరిపడే విధంగా కమర్షియల్ అంశాలు జోడించాడు. కాకపోతే కామెడీ , మ్యూజిక్ ఫై ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండు. మోహన్‌బాబు పాత్రలో విష్ణు ను చూపించి మంచు అభిమానులను ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా కథ కు తగ్గ డైరెక్షన్ చేసి ఓకే అనిపించాడు.

చివరిగా :

చిన్నప్పుడే తప్పిబోయిన కూతురి కోసం తండ్రి పడే ఆవేదనే ఈ గాయత్రి. చాల రోజుల తర్వాత మోహన్ బాబు వెండి తెర ఫై హీరో గా కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. విష్ణు , శ్రీయ ల యాక్టింగ్ బాగుంది. అనసూయ కు పెద్దగా ఈ మూవీ తో పేరు వచ్చింది ఏమిలేదనే చెప్పాలి. మంచు అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు గాయత్రి నచ్చుతుంది.