పార్లమెంటు సమావేశాల తర్వాత సంచలన నిర్ణయం

ఏపీకి బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరి మాట. కొత్త రాష్ట్రం ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు, రాజధాని నిర్మాణంకు సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. కాని కేంద్రం మాత్రం ఏపీకి ప్రత్యేకంగా ఏమాత్రం నిధులు కేటాయించలేదు. దాంతో కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్న టీడీపీ త్వరలోనే ప్రభుత్వం నుండి వైదొలిగే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తు విషయంలో కాస్త అటు ఇటుగా ఆలోచిస్తున్న టీడీపీ ప్రభుత్వంలో కొనసాగడంపై మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అంటూ ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌ సభ సమావేశ తర్వాత టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేసేందుకు సిద్దం అవుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఏపీ మంత్రి నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశిస్తే కేంద్ర మంత్రులు రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారు అంటూ ప్రకటించాడు. పార్లమెంటు సమావేశాల సమయంలో రాజీనామా నిర్ణయం సరైనది కాదనే ఉద్దేశ్యంతోనే నిర్ణయాన్ని వాయిదా వేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. మంత్రుల రాజీనామా తర్వాత పొత్తు విషయంలో చర్చలు జరపాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు. వచ్చే సంవత్సరంలో జరగబోతున్న ఎన్నికలకు ఒంటరిగానే వెళ్లాలని తెలుగు తమ్ముళ్లు ఉబలాట పడుతున్నారు.