టీమిండియా అతి పెద్ద విజయం

టెస్టు సిరీస్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటోంది కోహ్లీసేన . ఈ రోజు జరిగిన మూడో వన్డేలో ఆతిథ్య సౌత్ ఆఫ్రికా జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది భారత్. ఏకంగా 124పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది ఇండియా,

ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరబాదుడు బాదడంతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లో శిఖర్ ధావన్ 76, అజింక్యా రహానె 11, హార్దిక్ పాండ్యా 14, విరాట్ కోహ్లీ 160 (నాటౌట్), ధోనీ 10, జాధవ్ 1, భువనేశ్వర్ కుమార్ 16 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో దక్షిణాఫ్రికా ముందు టీమిండియా 304 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

304 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు. 179పరుగులకే కుప్పకూలింది. దీంతో 124పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది ఇండియా. సౌత్ ఆఫ్రికాపై భారత్ కు ఇదే అతి పెద్ద విజయం.