ఈ ఫొటోలో యవ్వనవతిగా కనిపిస్తున్న అందగత్తె ఎవరో చెప్పగలరా? మరెవరో కాదు. విజయ్‌సేతుపతి. కమలహాసన్ అవ్వైషణ్ముకి, ప్రశాంత్ ఆన్అళగన్ చిత్రాల్లో ఆడవారికి ఏ మాత్రం తీసిపోని విధంగా అవతారమెత్తి, హావభావాలను పలికించి మెప్పించారు. ఇటీవల నటుడు శివకార్తికేయన్ కూడా రెమో చిత్రంలో అందమైన నర్సుగా మురిపించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు విజయ్‌సేతుపతి.
విజయ్ సేతుపతి లేటెస్ట్ చిత్రం సూపర్ డీలెక్స్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాజిల్, సమంత, మిష్కిన్, రమ్యకృష్ణ, గాయత్రి, భగవతి పెరుమాల్ వంటి పెద్ద తారాగణం నటిస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి హిజ్రాగా నటిస్తున్నారు. గత కొన్నిరోజులుగా ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. విజయ్‌సేతుపతి నటిస్తున్న పాత్రలోని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. విజయ్ సేతుపతికి హిజ్రా మేకప్ వేస్తున్న ఫొటోలు విడుదల కావడంతో అవి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.