ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రం వద్ద ఏమాత్రం ప్రభావం చూపించలేక రాష్ట్రంలో పరువు పోగొట్టుకుంటున్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి నిధులు తీసుకు రావడంలో మాత్రం పూర్తిగా విఫలం అవుతున్నాడు. అందుకే ఎన్డీయే నుండి వైదొలిగి పరువు కాపాడుకోవాలనే నిర్ణయానికి సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినట్లుగా గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది.
తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందనే టాక్ వినిపిస్తుంది. కొత్త రాష్ట్రం ఏపీకి కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కాని మోడీ ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన స్థాయిలో కూడా ఏపీకి నిధులు ఇవ్వలేదు అంటూ తెలుగు దేశం ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలోనే తెలుగు దేశం ఎంపీలు హడావుడి చేశారు. ఎన్డీయే నుండి వైదొలుగుతాం అంటూ బెదిరించారు.
కాని ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లుగా తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అనిపిస్తుంది. మోడీని ఎదిరించి, నిలబడే సత్తా చంద్రబాబు నాయుడు లేదని, అందుకే ఎన్డీయేతోనే చంద్రబాబు నాయుడు కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.