దీపికా పదుకొణె టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘పద్మావత్’. సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు. సినిమాలోని ‘ఘూమర్..’ పాట వివాదమైన సంగతి తెలిసిందే. దీంతో దీపిక నడుమును కవర్ చేసి మళ్ళీ దిన్ని ఎడిట్ చేశారు.
అయితే ఇప్పుడు ఇదే పాటకు ఓ స్కేటర్ తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసింది. అదీ ఐస్ డాన్స్. మయూరి భండారి అనే స్కేటర్ ఐస్‌పై డ్యాన్స్ చేస్తున్న వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ‘పద్మావత్’ చిత్ర బృందానికి ఈ పాటను అంకితం ఇస్తున్నట్లు చెప్పిన మయూరి.. రాజస్థానీ అమ్మాయిగా ఈ పాటకు డ్యాన్స్ చేయడం గౌరవంగా భావించానని, ఈ పాట కొరియోగ్రఫీ బాధ్యతల్ని తనే చూసుకున్నట్లు వెల్లడించింది.
కాగ రాజ్‌పుత్ మహారాణి పద్మావతి జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద రికార్డుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా రెండు వందల కోట్ల దిశగా వెళుతుంది.