నిజమా..రాజమౌళి మల్టీస్టారర్ మూవీ లో బన్నీ కూడానా..?

బాహుబలి మూవీ తర్వాత రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ మూవీ రిలీజ్ అయి దాదాపు ఏడాది దగ్గరికి వస్తున్న ఇంకా రికార్డ్స్ నెలకొల్పుతూనే ఉంది. ఇక ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ని ఈ ఏడాది అక్టోబర్ లో మొదలు పెట్టి , వేసవి నాటికీ రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా మరో వార్త ఫిలిం సర్కిల్లో హల్చల్ చేస్తుంది.


అదేంటి అంటే ఈ మూవీ లో చరణ్ , ఎన్టీఆర్ లతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కనిపించబోతున్నాడనే వార్త మెగా అభిమానులను సంబరాలకు గురి చేస్తుంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం అనేది రాజమౌళి కానీ లేదా అల్లు అర్జున్ కానీ చెప్పాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాహుబలి లాంటి భారీ గ్రాఫిక్స్, సెట్స్ ఉండవు. బలమైన కథ కథనాలతో పక్కా స్క్రిప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి.

స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాకు సంభందించి నటినటులు ఎంపిక త్వరలో జరగనుంది. ప్రస్తుతం చరణ్ నటించిన ‘రంగస్థలం’ వచ్చే నెలలో విడుదలకానుంది. ఈ సినిమా తరువాత బోయపాటి సినిమా సెప్టెంబర్ లో పూర్తి అవుతుంది. అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ కూడా సెప్టెంబర్ లో పూర్తి చేయాలనీ చూస్తున్నారు. వీరిద్దరి సినిమాలు పూర్తి కాగానే రాజమౌళి మూవీ లో జాయిన్ కాబోతారు.