బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విటర్ నుంచి తప్పుకుంటానని ప్రకటించడం షాకింగ్ వుంది నిన్న రాత్రి ఓ ట్వీట్ పెట్టారు. ‘ట్విటర్..నా ఫాలోవర్ల సంఖ్యను తగ్గించేశావు. ఇది జోక్‌గా అనిపిస్తోంది. నిన్ను వదిలించుకోవాల్సిన సమయం వచ్చింది. ఆసక్తికరమైన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. థాంక్యూ’ అంటూ అమితాబ్ పోస్ట్ చేశారు.
ట్విటర్లో అమితాబ్ ఫాలోవర్ల సంఖ్య 32,902,353. అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీ అమితాబే. అయితే ఆయన ఫాలోవర్స్ సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయినట్లు గమనించార. ఆయన ఫాలోవర్లలో కొంత మందిని ట్విటరే తగ్గించినట్లుంది. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విటర్ నుంచి తప్పుకుంటానని అంటున్నారు. అమితాబ్ ఈ ట్వీట్ పెడుతూ..‘హమ్’ చిత్రంలో తను విలన్ గొంతు పట్టుకున్న స్టిల్‌ను పోస్ట్ చేయడం విశేషం.