తన వద్ద పని చేస్తున్న యువతిని లైంగికంగా వేదించిన కేసులో గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. పోలీసులు పలు సార్లు రిమాండ్‌లోకి తీసుకుని గజల్ శ్రీనివాస్‌ను విచారించడం జరింగింది. తాజాగా కోర్టు గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు విచారణ వేగంగా జరపాలని పోలీసులను ఆదేశించింది.
కోర్టు బెయిల్ అవ్వడంతో నేడు సాయంత్రం సమయంలో చంచల్ గూడ జైలు నుండి బయటకు వచ్చిన గజల్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడాడు. తనను అక్రమంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని, తాను నిర్దోషిగా బయటకు వచ్చి తీరుతాను అంటూ గజల్ శ్రీనివాస్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్న కారణంగా తాను అంతకు మించి ఏమీ మాట్లాడద్చుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు.
మీడియా ప్రశ్నిస్తున్నా కూడా గజల్ శ్రీనివాస్ చకచక పరుగెడుతూ వెళ్లి తన కారులో ఇంటికి వెళ్లి పోయాడు. వారంలో రెండు సార్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో గజల్ శ్రీనివాస్ సంతకం చేయాల్సి ఉంటుంది. కేసు నిమిత్తం పోలీసులకు సహకరించాలని కూడా కోర్టు గజల్ శ్రీనివాస్‌ను ఆదేశించింది.