తెలంగాణలో పవన్ చేస్తున్న యాత్రను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో వారికి పవన్ షాకింగ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తాజాగా ఖమ్మంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్ కాంగ్రెస్ నాయకులు అంటే తనకు గౌరవం అని, కాంగ్రెస్‌లో ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. తెలంగాణ సీఎం అభ్యర్థిగా వి హనుమంతరావును ప్రకటిస్తే తాను 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.
తెలంగాణ సీఎం అభ్యర్థిగా విహెచ్‌ను నిలబెడితే తాను స్వయంగా కాంగ్రెస్ తరపున ప్రచారం చేసి, ఆ పార్టీని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. వీహెచ్‌తో కలిసి పనిచేసేందుకు తాను సిద్దంగా ఉన్నాను అంటూ పవన్ చెప్పుకొచ్చాడు. వీహెచ్ గారు మీరు నాతో రండి, ఇంటింటికి తిరుగుదాం, ప్రజా సమస్యలు తెలుసుకుందాం అంటూ పవన్ చెప్పుకొచ్చాడు.
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు అంతా సహకరించాని, తెలంగాణలో ఉన్న ప్రభుత్వంకు మద్దతుగా నిలిచి అభివృద్దికి పాటు పడాల్సిందిగా పవన్ పిలుపునిచ్చాడు. తెలంగాణలో పవన్ పర్యటనను విహెచ్ అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో పవన్ పై వ్యాఖ్యలు చేశాడు. మరి ఈ ఆఫర్‌కు కాంగ్రెస్ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.