హిందుత్వ పార్టీ అయిన బీజేపీకి ముస్లీం పార్టీ అయిన ఎంఐఎంకు ఎప్పుడు కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేప్పటినప్పటి నుండి దేశంలో ముస్లీంలకు స్థానం లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ నిన్న మొన్నటి వరకు ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దిన్ ఒవైసీ విమర్శలు గుప్పించాడు. మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుబడుతూ ఉండే ఒవైసీ తాజాగా మోడీపై కాస్త మెతక వైకరితో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. కర్నూలలో ఒక సభలో ఒవైసీ మాట్లాడుతూ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ఒవైసీ మాట్లాడుతూ.. మోడీ తీసుకున్న ట్రిపుల్ తలాక్ కారణంగా ముస్లీంలు అంతా కూడా ఒక్క తాటిపైకి వచ్చారు అని, ఇప్పటి వరకు చెల్లా చెదురుగా ఉన్న ముస్లీంలు ఏకం కావడంలో మోడీ తీసుకున్న నిర్ణయం బాగా పని చేసిందని చెప్పుకొచ్చాడు. ఇటీవలే హజ్ యాత్రకు రాయితీని తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఒవైసీ సమర్ధించాడు. ఆ వెంటనే రెండవ సారి మోడీ వల్ల ముస్లీంలకు మంచి జరుగుతుందని ఒవైసీ చెప్పడం అందరికి ఆశ్చర్యంగా ఉంది.
మోడీకి ముస్లీంలపై అభిమానం ఉంటే, ముస్లీం మహిళలు అంటే అభిమానం బడ్జెట్లో వారి కోసం నిధులు కేటాయించాలి అంటూ ఒవైసీ డిమాండ్ చేశాడు. ట్రిపుల్ తలాక్‌తో ముస్లీంలకు న్యాయం చేయాలని భావిస్తున్న కేంద్రం మరింత అన్యాయం చేస్తుందని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.