అల్లు అర్జున్ కోటి రూపాయల ఖరీదు చేసే బట్టలు షాపింగ్ చేశాడు. బండ్ల గణేష్, బన్నీ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రం లో బన్నీ డ్రెస్సుల కోసం ఈ ఖర్చయ్యిందట. ఇందులో కేరక్టర్ డిమాండ్ మేరకు హీరో 60 రకాల డ్రెస్సుల్లో కనిపిస్తారని వినికిడి. పూరి, బన్నీ దగ్గరుండి మరీ ఈ డ్రెస్సులను కొన్నారట. అల్లు అర్జున్ వాటిల్లో కొన్ని డ్రెస్సులు వేసుకుని ఫొటోషూట్ కూడా చేశారట. ‘దేశముదురు’లో బన్నీని ‘సిక్స్‌ప్యాక్’లో చూపించిన పూరి ఈసారి డిఫరెంట్ లుక్‌తో, మరింత స్టయిలిష్‌గా చూపించాలనుకుంటున్నారట. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన్ అమలా పాల్, కేథరిన్ ఆడి పాడనున్నారు. నిర్మాత గణేష్… ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రం కోసం కూడా ఖర్చు విషయంలో రాజీపడకుండా డబ్బు వెచ్చిస్తు న్నారట.