తెలంగాణపై డిసెంబర్ 28 న అఖిలపక్షం..?

తెలంగాణ అంశంపై ఈ నెల 28వ తేదిన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం సంకేతాలు ఇచ్చింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు మెట్టు దిగకపోవటంతో తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అంగీకరించినట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాల అనంతరం అఖిలపక్ష సమావేశం నిర్ణహిస్తామని ఆయన తెలిపారు.

కాగా  మ్తుందుగా టి. ఎంపీలు ఎఫ్ డీఐ ఓటింగ్ లో పాల్గొనేలా చేసే ఉద్దేశంతో షిండే ద్వారా కాంగ్రెస్ పెద్దలు త్వరలో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని హామి ఇప్పించినట్లు తెలిసింది. అయితే నిర్ధిష్టమైన తేది ప్రకటించకుండా హామీ ఇవ్వటంపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు అసహనంతో అనుమానం వ్యక్తం చేశారు.  సోనియా స్వయంగా అఖిలపక్షంపై హామి ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అలాగే ఎఫ్.డీ.ఐలపై ఓటింగ్ లో పాల్గొనే విషయమై తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేశారు. దీంతో మెట్టుదిగిన అధిష్టానం అఖిలపక్ష సమావేశానికి డిసెంబర్ 28 ని ముహూర్తంగా నిర్ణయించినట్ట్లు తెలిసింది.