తొలిచిత్రం సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి వచ్చిన మరోహీరో సుధీర్ సరసన చేసిన “ఎస్.ఎం.ఎస్”… అయినా రెజీనాకు పెద్దగా బ్రేక్ రాలేదు. అయితే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తను నటించిన రెండవ చిత్రం “రొటీన్ లవ్ స్టోరీ” బాక్సాఫీస్ వద్ద చెప్పుకొదగ్గ సక్సెస్ సాధించలేకపోయినప్పటికీ టాలీవుడ్ చూపు మాత్రం రెజీనా మీద పడిపోయినట్టు కనిపిస్తోంది. ‘రొటీన్ లవ్ స్టోరీ’ లో హీరొయిన్ గా ఇండస్ట్రీతో పాటు యువతను ఆకట్టుకుంది రెజీనా. ఇప్పడు ఈ ముద్దుగుమ్మకు ఒకేసారి రెండు బంపర్ ఆఫర్లు వచ్చిపడ్డాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజ్ నిర్మిస్తున్న చిత్రానికి గాను రెజీనాను సెకెండ్ హీరొయిన్ గా ఓకే చేసినట్టు సమాచారం. ఇప్పటికే రెజీనా.. నారా రోహిత్ సరసన ఓ చిత్రంలో నటించడానికి ఎంపికైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి రెజీనాను తెలుగు తెరకు పరిచయం చేసిన “ఎస్.ఎం.ఎస్” చిత్ర దర్శకుడు తాతినేని సత్య దర్శకుడని తెలిసింది. ఇలానే వరస ఆఫర్లు మరికొన్ని వచ్చేస్తే రెజీనా కూడా టాలీవుడ్ లో బిజీ హీరొయిన్ల లిస్టులో చేరిపోవడం గ్యారెంటీ.