చరణ్ కు షాక్ ఇచ్చిన చిరంజీవి

చరణ్ బాలీవుడ్ డెబ్యు మూవీ’ జంజీర్ ‘. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎలాంటి సమాచారం లేకుండా ఈ షూటింగ్ సెట్లోకి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు మెగాస్టార్ చిరంజీవి. విశేషం ఏమిటంటే చిరు వస్తున్న సంగతి చరణ్ కు కూడా తెలియదట. ఈ సడన్ సర్ ప్రైజ్ నుండి తేరుకుని దర్శకుడు అపూర్వ లఖియాతో పాటు, హీరో రామ్ చరణ్, హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. సెట్ లో కొంత సేపు గడిపిన చిరంజీవి షూటింగ్ విశేషాలు దర్శకుడు లఖియాను అడిగి తెలుసుకున్నారు. అమిత్ మిశ్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ దేవిశ్రీ సమకూరుస్తున్నారు. చరణ్ తో పాటు దేవిశ్రీ కూడా ఈ చిత్రంతోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోండడం మరో విశేషం.