మంచు వారి ఇంట్లో… పుట్టినరోజు పండగ

డిసెంబర్ 2… మంచు వారి కుటుంబానికి చాలా ప్రత్యేకమైన రోజు. ఏడాది క్రితం ఇదే రోజు… ఆ ఇంట్లో మహాలక్ష్మి జంటగా పుట్టింది. అవియానా, వివియానా రూపంలో. విష్ణు కి పుత్రికా ఉత్యాహం కలిగించిన రోజు అది. కవల పిల్లలు వస్తూ వస్తూ ఆ ఇంట్లో విజయ లక్ష్మి ని తీసుకొచ్చారు. విష్ణు ఎంతోకాలం నుంచి ఓ సూపర్ హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ విజయం ‘దేనికైనా రెడీ’ రూపం లో వరించింది. నిర్మాతగా మోహన్ బాబుకీ ఈ సినిమా గొప్ప ఊరట ఇచ్చింది. అదంతా అవి, వివి ల మహిమే అని మంచు కుటుంబానికి గట్టి నమ్మకం. అందుకే… వారిద్దరి పుట్టిన రోజు ఆదివారం రాత్రి   ‘యన్ కన్వెన్షన్ హాల్’  లో   ఘనంగా కన్నుల పండువగా జరిపారు. సినీ, వ్యాపార, రాజకీయ, పత్రికా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ పుట్టిన రోజు పండగకి హాయరై… అవియానా, వివియానా లను మనస్పూర్తిగా ఆశీర్వదించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణంరాజు, ఏవీయస్, బ్రహ్మానందం తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ‘దేనికైనా రెడీ’ టీమ్ యావత్తూ.. పుట్టినరోజు పండగలో పాల్గున్నారు. ఈ మధ్యకాలం లో ఎంత భారీ ఎత్తున జన్మదిన సంబరాలు ఎవరూ జరుపుకోలేదట. సాధారణంగా మోహన్ బాబు ఇలాంటి ఆర్భాటాలకు దూరంగా వుంటారు. అలాంటిది ఈ వేడుకలో ఆయన హంగామానే ఎక్కువగా కనిపించిందట.