వదినమ్మా.. రెండో పెళ్లి వద్దమ్మా… !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా.. ఆయన మాజీ భార్య రేణు దేశాయ్’ని ఇప్పటికీ ఎంతో గౌర‌విస్తారు. ఆమెని వదినమ్మగా పిలుస్తుంటారు. పవన్ గురించి రేణు సోషల్ మీడియాలో చెప్పే విషయాలని ఎంజాయ్ చేస్తుంటారు. ఆమె పవన్ గురించి మరిన్ని విశేషాలు ఎప్పుడెప్పుడు చెబుతారా.. ? అన్న ఆశతో ఎదురు చూస్తుంటారు. అలాంటి పవన్ అభిమానులు ఇప్పుడు వదినమ్మ రేణు దేశాయ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఓ తోడు కావాలని అనిపిస్తుందని రేణు దేశాయ్ అన్న విషయం తెలిసిందే. దీంతో.. రేణు దేశాయ్ రెండో పెళ్లికి రెడీ అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఫేస్ బుక్ ఖాతా ద్వారా రేణుకి పవన్ అభిమానులు సలహాలు ఇస్తున్నారు. ‘మీరు రెండో పెళ్లి చేసుకుంటారా? ఐ హేట్ యూ… మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీరు చ‌చ్చినంత ఒట్టు.. మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీపై గౌర‌వం త‌గ్గిపోతుంది.. ప‌వ‌న్ కల్యాణ్ ని అన్న అని పిలుస్తాం నిన్ను వ‌దిన అంటాం.. మీ నిర్ణ‌యంతో అంద‌రూ బాధ ప‌డే అవ‌కాశం ఉంది’ ఆమెకి ఉచిత సలహాలు ఇస్తున్నారు.

ఈ కామెంట్లపై రేణు దేశాయ్ మండిపడుతోంది. ఒక అమ్మాయి మ‌రో బంధం గురించి ఆలోచించడం కూడా తప్పేనా అని ఆవేద‌న వ్యక్తం చేస్తోంది. మరీ..ఇప్పటికైనా వదినమ్మకి బాధపెట్టే కామెంట్స్ చేయడం పవన్ అభిమానులు ఆపుతారేమో చూడాలి.