1980లలో వాణివిశ్వనాద్ మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్గా కొనసాగింది. స్టార్ హీరోల సినిమాలో అందాలు ఆరబోసి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అయితే పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. తాజాగా అందరిలాగే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈమెను బోయపాటి శ్రీను ‘జయ జానకి నాయక’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఈ సమయంలోనే ఈమె రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తెలుగు దేశంలో ఈమె ఎంట్రీ త్వరలోనే ఉండబోతున్నట్లుగా చెబుతున్నారు.
వైకాపాలో ఉన్న రోజాను తట్టుకోవాలంటే తెలుగు దేశం పార్టీకి ఒక ఫైర్ బ్రాండ్ సినీ సెలబ్రెటీ కావాలి. అది వాణి విశ్వనాద్ అయితే బాగుంటుందని తెలుగు దేశం నాయకులు కూడా భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సైతం వాణివిశ్వనాద్కు పార్టీలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. వాణివిశ్వనాద్ తెలుగు దేశం పార్టీ ఎంట్రీ వెనుక బోయపాటి శ్రీను ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. వాణివిశ్వనాధ్ను టీడీపీ అధినేత చంద్రబాబుకు బోయపాటి పరిచయం చేశాడని తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడతో బోయపాటికి సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టాల్సి ఉంటే వాటిని సీఎం చంద్రబాబు నాయుడు బోయపాటి ఆధ్వర్యంలో చేయిస్తూ ఉంటాడు. అందుకే బోయపాటి చెప్పడంతో వాణివిశ్వనాద్కు పార్టీలో మంచి స్ధానం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుండి ఆమె పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.