వైకాపా అధినేత వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం ప్రశాంత్ కిషోర్‌తో దాదాపు 500 కోట్ల డీల్‌ను కూడా మాట్లాడుకున్నాడు. పీకే సలహాలు, సూచనలతో పార్టీని 2019 ఎన్నికల్లో విజయం దిశగా తీసుకు వెళ్లాలని జగన్ అభిప్రాయ పడుతున్నాడు. ఈ సమయంలో జగన్‌కు ప్రజల నుండి పార్టీ నాయకుల నుండి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నారు.
ఇప్పటికే నంద్యాలలో వైకాపాకు భారీ ఓటమిని ఇచ్చిన ప్రజలు ఆ తర్వాత కాకినాడలో వైకాపాకు చుక్కలు చూపించారు. ప్రజల నుండి ఈ స్థాయిలో తిరష్కరణ ఉంటుందని బావించని జగన్ ఏం చేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్నాడు. పైకి మాత్రం ఇది అధికారంతో పొందిన విజయాలని, 2019 ఎన్నికల్లో తమ గెలుపు ఖాయం అంటూ చెబుతున్నాడు.
ఈ సమయంలోనే పార్టీకి చెందిన దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యేందుకు సిద్దం అవుతున్నారనే వార్తలు జగన్‌ను కలవర పెడుతున్నాయి. ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు గోడ దూకారు. ఇంకా ఎమ్మెల్యే పార్టీ నుండి వెళ్లి పోతే మరింత బలహీన పడిపోతామని జగన్ ఆందోళన చెందుతున్నాడు.
వైకాపా నుండి ఆరుగురు ఎమ్మెల్యేలు దసరా తర్వాత టీడీపీలో జాయిన్ కాబోతున్నట్లుగా చెబుతున్నారు. అదే కనుక జరిగితే జగన్‌కు పెద్ద షాక్ తప్పదని అంటున్నారు. ఆ పార్టీ నాయకులు మరియు ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీ ప్రచారం చేస్తున్నట్లుగా మా పార్టీ నుండి ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్లబోవడం లేదని, మీడియాలో అనవసర పుకార్లు ప్రచారం అవుతున్నాయని అంటున్నారు.