మరిన్ని ధరలు పెరుగుతాయ్‌.. జాగ్రత్త : సీ ఎం

అందరూ ఊహించినట్లుగానే ప్రభుత్వం విద్యుత్ సర్ ఛార్జీలపై చేతులెత్తేసింది. రాబోయే వేసవిలో విద్యుత్ సమస్య మరింత జఠిలమవుతుందని, దీంతో సర్‌ఛార్జీలను జనమే భరించాల్సి వస్తుందని, కరెంట్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్ చార్జీలపై ప్రభుత్వం ఏమీచేయలేదని తేల్చేసి చేతులెత్తేశారు. కరెంట్ కష్టాలు గ్యాస్ ఉత్పత్తి తగ్గడంతో పెరగబోతున్నాయని సీఎం చెప్పుకొచ్చారు. కరెంట్‌ ఛార్జీలు, మద్యం ధరలే కాదు, ఇంకా పెంచాల్సిన ధరల జాబితా చాలా ఉందని చావు కబురు చల్లగా చెప్పారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో గ్యాస్ సిలిండర్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మీడియాలో వార్తలొస్తున్నట్లుగా తనకు ఏ టీవీ, పత్రిక సంస్థలతో సంబంధం లేదని వివరించారు.