ఆడవారు అర్థరాత్రి ఒంటరిగా రోడ్డుపైకి వచ్చి, తిరిగిన రోజే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లుగా గాంధీజీ చెప్పుకొచ్చారు. కాని ఆ స్వాతంత్య్రం ఇప్పుడే కాదు, ఎప్పటికి వచ్చేలా లేదు. స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఆడపిల్ల రోడ్డు మీద తిరగాలి అంటే భయపడుతుంది. అర్థరాత్రి సమయం పక్కన పెడితే పట్టపగలు రోడ్డు మీద నడిచేందుకు అమ్మాయిలు జంకుతున్నారు. చండీఘడ్‌లో దారుణం జరిగింది.
8వ క్లాస్ చదువుతున్న 13 సంవత్సరాల అమ్మాయి స్కూల్‌లో జెండా పండుగ కార్యక్రమంకు హాజరు అయ్యి, తిరిగి ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలోనే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమెను బలవంతంగా ఎత్తుకు పోయాడు. ఒక పార్ట్‌లోకి తీసుకు వెళ్లి అమ్మాయిపై అఘాయిత్యంకు పాల్పడ్డాడు. తీవ్ర రక్త స్రావం జరుగుతుండటంతో పాటు, ఆమె లేవలేని పరిస్థితుల్లో ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు అందించారు.
పోలీసులు బాలికను వెంటనే హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు. నిందితుడి కోసం పోలీసులు వెదుకుతున్నారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం అంతడు 35 నుండి 40 సంవత్సరాల వయస్సు కలిగిన వాడని తెలుస్తోంది. అతడి స్కెచ్ వేయించే ప్రయత్నం చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు జరిగిన ఈ సంఘటన దేశానికే మచ్చగా చెప్పుకోవచ్చు.