ప్రభాస్, సుజీత్‌ల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రం ‘సాహో’. గత మూడు సంవత్సరాలుగా సుజీత్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘బాహుబలి’ పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ తన తర్వాత సినిమాను చేస్తాను అంటూ చెప్పడంతో సుజీత్ కూడా ప్రభాస్ వచ్చే వరకు వేచి చూశాడు. ఎట్టకేలకు ‘సాహో’ చిత్రానికి ఏర్పాట్లు మొదలు అయ్యాయి.
ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన ‘సాహో’ చిత్రం కోసం హీరోయిన్గా బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్ ఇలా అన్ని భాషల్లో కూడా హీరోయిన్స్‌ను పరిశీలించారు. పలువురితో ఆడిషన్స్ చేయడం జరిగింది. కాని చిత్రంకు సరిగ్గా సూట్ అయ్యేది శ్రద్దా కపూర్ అని చిత్ర యూనిట్ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆమెను మొదట్లోనే పరిశీలించి, సంప్రదించారు. కాని ఆమె భారీ పారితోషికం చెప్పడంతో మరో హీరోయిన్ కోసం సంప్రదింపులు జరిపారు. కాని ‘సాహో’కు శ్రద్దా కపూర్ అయితేనే కరెక్ట్ అంటూ అంతా భావించి ఆమెను ఎంపిక చేయడం జరిగింది.
కాస్త ఎక్కువ పారితోషికం అయినా కూడా ప్రభాస్‌కు సరి జోడీ అని దర్శకుడు మరియు నిర్మాతలు భావిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ప్రభాస్‌కు శ్రద్దా కపూర్ జోడీగా అస్సలు బాగోలేదని, వారిద్దరి కాంబినేషన్‌కు ప్రేక్షకుల నుండి నెగటివ్ స్పందన వస్తుందనే విమర్శలు చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా ‘సాహో’ చిత్రంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ల రొమాన్స్ చూడబోతున్నాం.