‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత పవన్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్‌లుక్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా నేడు విడుదల చేస్తారని అంతా భావించారు. కాని పవన్ కళ్యాణ్ నేడు సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయడం లేదా ఫస్ట్‌లుక్ విడుదల చేయడం వంటివి చేయలేదు. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంను వ్యక్తం చేశారు. అయితే వచ్చే నెల 2న చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించి ఫ్యాన్స్‌ను శాంతింప జేయడం జరిగింది. టైటిల్ కూడా అదే సమయంలో ప్రకటించనున్నారు.
వరుసగా పరాజయాలతో ఉన్న పవన్‌కు ఈ చిత్రం సక్సెస్ చాలా అవసరం. ఇక వరుసగా సక్సెస్‌ల మీద సక్సెస్‌లు దక్కించుకుంటున్న త్రివిక్రమ్‌కు ఈ సినిమా సక్సెస్ ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటి వరకు పవన్, త్రివిక్రమ్ కాంబోకు తిరుగు లేదు. అందుకే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బాక్సులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మరియు అను ఎమాన్యూల్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమాను తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్మాత రాధాకృష్ణ పేర్కొన్నారు. ఫస్ట్‌లుక్ కోసం మరో 18 రోజులు ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.