ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్ రోజు రోజుకు ఉన్మాదిలా మాట్లాడుతున్నారని, ఆయన తీరు చూస్తుంటే ఏదో ఒక రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును చంపేసి సీఎం పీఠంపై తాను కూర్చోవాలని భావిస్తున్నాడని, నడిరోడ్డు మీద సీఎంను కాల్చమని ప్రజలకు పిలుపును ఇవ్వడం చూస్తుంటే ఆయనలో ఏ స్థాయి ఉన్మాది దాగి ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ ఉన్మాది మరింతగా రెచ్చిపోకముందే జాగ్రత్త పడాలని తెలుగు దేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
ఏపీ డీజీపీ సాంభశివరావును పలువురు టీడీపీ నాయకులు కలవడం జరిగింది. ఈ సందర్బంగా వారు డీజీపీకి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలను వివరించడం జరిగింది. గత కొన్ని రోజులుగా జగన్ వ్యవహరిస్తున్న తీరును కూడా టీడీపీ నాయకులు డీజీపికి తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారికి వైకాపా అధినేత వైఎస్ జగన్ నుండి ప్రాణహాని ఉందని, అందుకే సీఎం గారికి ఎక్కువ భద్రత కల్పించడంతో పాటు, ఆయన్ను హద్దుల్లో ఉంచాల్సిందిగా తెలుగుదేశం యువ నేత అవినాష్ పేర్కొన్నారు.
వైఎస్ జగన్ చేసిన విమర్శలకు తెలుగు దేశం నాయకులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. జగన్‌పై మూకుమ్మడి దాడికి టీడీపీ నాయకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది.