సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల చాలా సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. నటిగా పలు చిత్రాల్లో చేసిన ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. ఇక మహేష్‌బాబు సినిమాలతో పాటు పలు చిత్రాలను ఆమె నిర్మించారు. కాని నిర్మాతగా కూడా ఆమె ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సాధించలేక పోయారు. దాంతో కొన్నాళ్లుగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండి, మళ్లీ ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఈసారి నటిగా, నిర్మాతగా కాదు. చాలా కాలంగా దర్శకత్వం చేయాలనే కోరిక ఆమెలో ఉంది. ఆ కోరికను తీర్చుకోబోతుంది.
సందీప్ కిషన్ హీరోగా అమైరా దస్తూర్ హీరోయిన్గా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. ప్రస్తుతం చకచక చిత్రం షూటింగ్ జరిగిపోతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైర్ను వదిలేందుకు మంజుల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం సరైన సమయంను ఎంచుకుంది. అదే స్పైడర్ చిత్రం రిలీజ్. మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘స్పైడర్’ చిత్రం దసరా కానుకగా వచ్చే నెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం చేశారు.
స్పైడర్ చిత్రంతో తన సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తే విపరీతమైన క్రేజ్ రావడం ఖాయం అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. అందుకు మహేష్‌బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే టైటిల్‌ను ఖరారు చేసి ట్రైలర్‌కు ముందు పోస్టర్స్‌ను విడుదల చేయబోతుంది. కొత్త తరహా ప్రేమ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా ఆమె చెబుతున్నారు. మరి చిత్రం ఆమెకు ఎలాంటి ఫలితాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి.