కరెన్సీ కట్టలతో వరలక్ష్మి వత్రం

సాదారణంగా మహిళలు శ్రావణ మాసంలోని ఒక ప్రత్యేకమైన శుక్రవారం రోజున తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, తమ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు తులతూగాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం చేస్తారు. డబ్బుల కోసం ఈ వ్రతం చేస్తారు. కాని బెంగళూరుకు చెందిన ఒక కుటుంబం మాత్రం నోట్ల కట్టతో వరలక్ష్మి వ్రతం చేయడం జరిగింది. దాదాపు 73 లక్షల కరెన్సీ నోట్లపై అమ్మ వారి ప్రతిమను ఉంచి వ్రతం చేయడం జరిగింది. ఈ వ్రతంకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

బెంగళూరుకు చెందిన సూరి కుటుంబ సభ్యులు గత పది సంవత్సరాలుగా ఇదే తరహాలో వ్రతం చేసుకుంటున్నారట. వ్రతంకు వారం రోజుల ముందే తమ సన్నిహితులు అంతా కూడా బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును అంతా డ్రా చేసుకుని వచ్చేస్తారు. ఆ మొత్తం డబ్బును ఇలా పేర్చి అందంగా అలంకరించి వ్రతం చేస్తామని సూరి చెబుతున్నాడు. ఇంత డబ్బుతో వ్రతం చేసినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ సొమ్ము అంతా కూడా లీగల్‌గానే సంపాదించిందని, తమకు ఎలాంటి భయం లేకుండా అమ్మ వారిని పూజించాము అని చెప్పుకొచ్చాడు. ఆ మొత్తం  డబ్బు మళ్లీ ఎవరి అకౌంట్స్‌లోకి వారివి వెళ్లడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చాడు. అలా వ్రతం చేయడం వ్ల తమకు కలిసి వస్తుందని, అందుకే అదే ఆనవాయితిని కొనసాగుతున్నట్లుగా ఆయన చెబుతున్నాడు. కొందరు మాత్రం ఈ వ్రతంపై విమర్శలు గుప్పిస్తున్నారు.