తెలుగు నిర్మాతల్లో గుణశేఖర్‌కు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఆయన ప్రతి సినిమా కూడా భారీగా తీసేందుకు ప్రయత్నిస్తాడు. తెలుగు సినిమా పరిశ్రమలో మొదట మొదటి భారీ సెట్టింగ్‌లు వేసిన దర్శకుడు గుణశేఖర్. ఈయన అప్పట్లో ఒక్కడు సినిమా కోసం కోటి పెట్టి సెట్టింగ్ వేస్తే అంతా కూడా అవాక్కయ్యారు. తాజాగా ఈయన ‘రుద్రమదేవి’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు.
ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అలాగే ఆర్థికంగా కూడా గుణశేఖర్‌కు ఇబ్బందుల లేకుండానే బిజినెస్ జరిగింది. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రతాపరుద్రుడు చిత్రాన్ని గుణశేఖర్ మొదలు పెడతాడేమో అని అంతా భావించారు. కాని గత కొన్ని రోజులుగా ప్రహ్లాదుడు జీవిత కథతో సినిమా తీస్తాడని ప్రచారం జరుతుంది.
గుణశేఖర్ ‘భక్త ప్రహ్లాద’ చిత్రాన్ని కూడా పక్కకు పెట్టాడని, ఆ సినిమాలో నటించేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో మరో స్క్రిప్ట్ వర్క్‌పై పడ్డట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గుణశేఖర్ తర్వాత సినిమా ప్రహ్లాద జీవిత చరిత్రతోనే అని తేలిపోయింది. తాజాగా ఆయన స్వయంగా మీడియాతో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పుడు ప్రారంభించేంది, ఎవరు ఈ సినిమాలో ఉండేది మాత్రం ఇంకా ఆయన క్లారిటీగా చెప్పలేదు.
అలాగే ఈ సినిమాకు టైటిల్‌గా తాను ‘భక్త ప్రహ్లాద’ అనుకోవడం లేదని, తన మనస్సులో మరో టైటిల్ ఉందని, ఆ టైటిల్ అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు. ఒక స్టార్ హీరో ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో ముఖ్య పాత్రలో ఒక హీరో కొడుకు కనిపించనున్నాడు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాు గుణశేఖర్ వచ్చే సంవత్సరం మొదట్లో ప్రకటిస్తాడనే చర్చ జరుగుతుంది.