సినిమా పరిశ్రమలో సక్సెస్ వచ్చినా కష్టమే, రాకున్నా కూడా కష్టమే. సక్సెస్ రాలేదు అంటే సినిమా ఛాన్స్‌లు దక్కవు. చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే ప్రేక్షకాధరణ లభించదు. అయితే సక్సెస్ అయితే పైవని ఉంటాయి. ఇక మరీ ఎక్కువ సక్సెస్ అయితే దారుణంగా మనశ్శాంతి కూడా దక్కకుండా చేస్తారు. తాజాగా రాజమౌళి పరిస్థితి అలాగే ఉంది. ‘బాహుబలి’ సినిమా తర్వాత రాజమౌళిని కలుసుకునేందుకు, మాట్లాడేందుకు ఎందరో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా బాలీవుడ్ సినీ ప్రముఖులు పలువురు రాజమౌళితో మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీకు వీలు ఉన్నట్లుగా మా బ్యానర్లో సినిమా చేయాల్సిందిగా పలు హిందీ నిర్మాణ సంస్థలు కోరుతున్నాయి. ఫోన్ ఆన్సర్ చేయకుంటే మెసేజ్‌లు, మెసేజ్‌లకు రెస్పాండ్ అవ్వకపోతే కాల్స్, ఇలా రాజమౌళిని ఫోన్లు కొట్టి కొట్టి చిరాకెత్తించారు. దాంతో రాజమౌళి మొత్తానికే ఫోన్‌ను ఆఫ్ చేసి పక్కకు పడేశాడట. ఈ విషయాన్ని రాజమౌళి సన్నిహితులు చెబుతున్నారు.
బాలీవుడ్ సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా టాలీవుడ్ కోలీవుడ్ వారు కూడా రాజమౌళితో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి ఫోన్‌కు రోజుకు వందల ఫోన్ు వస్తున్నాయట. అందుకే వాటిని ఎత్తి సమాధానం చెప్పలేక ఇలా చేస్తున్నట్లుగా తెలుస్తోంది.