మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘స్పైడర్’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఈ నేపథ్యం లో అభిమానులకు చిత్ర యూనిట్ సర్ప్రైజ్ అందించింది. ఈ మూవీ లోని ‘బూమ్ బూమ్’ అనే పాట టీజర్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. పూర్తి పాటను ఆగస్టు 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు టీజర్లో తెలిపారు. అంతే కాదు సాంగ్ మేకింగ్ వీడియోను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ పనులు కొనసాగుతున్నాయి. రష్యా, ఇరాన్, యూకేతో పాటు మరికొన్ని దేశాలు, ఇండియాలో కూడా వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన రామ్ చరణ్ మగధీరకు పనిచేసిన ఇరాన్ యూనిట్ స్పైడర్ కోసం పని చేయడం విశేషం.. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబరు 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.