జై లవకుశ టీజర్ మారిందా..లేక అదేనా..?

ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ సినిమాకు సంబదించిన ఫస్ట్ లుక్ టీజర్ రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటల 22 నిమిషాలకు రిలీజ్ చేయనున్న సంగతి తెల్సిందే. ఈ టీజర్ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇటీవల ఈ టీజర్ బయకు లీక్ అవడం , ఎలా ఉండబోతుందనేది అందరికి తెలియడం తో అదే టీజర్ ను రిలీజ్ చేస్తారా..లేక మరొకటి రిలీజ్ చేస్తారా అని అంత మాట్లాడుకుంటున్నారు. లీక్ వీడియోలో క్వాలిటీ లేకపోయినా కంటెంట్ మాత్రం ఆడియన్స్ కు తెలిసిపోయింది. ఎక్కువమంది వీడియో చూస్తే, చాలామంది ఫొటోలు చూసేశారు. మరి రేపు ఎన్టీఆర్ బృందం ఏం చుపిస్తున్నారో అనేది చూడాలి.

బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.