శ్రీను వైట్లపై ఆయనకు గట్టి నమ్మకం

ఎంతటి పెద్ద దర్శకుడికైనా బ్యాడ్ టైం ఉటుంది. శ్రీను వైట్ల కూడా ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ లోనే వున్నారు. ఆగడు, బ్రూస్లీ, మిస్టర్.. ఇలా వరుసగా ఎదురుదెబ్బలు తగిలి రేసు లో పూర్తిగా వెనుక బడిపోయారు. అయితే మిస్టర్ తర్వాత ఆయన వేగంగానే సినిమాను సెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. హీరో రవితేజకు ఓ కధ చెప్పి ఒప్పించారు. ఓ మాంచి స్క్రిప్ట్ తయారుచేసి, కొద్ది రోజుల క్రితం ఫుల్ నెరేషన్ ఇచ్చారట వైట్ల. హీరో రవితేజకు ఇది నచ్చేసింది.

రవితేజ-శ్రీను వైట్ల కాంబినేషన్ లో దుబాయ్ శీను, వెంకీ లాంటి పెద్ద హిట్ లే వున్నాయి. అయితే అది గతం. ఇప్పుడు వైట్ల మ్యాజి వర్క్ అవుట్ కావడం లేదు. ఆయన ఏది తీసినా ఫ్లోప్ అయి కూర్చుటుంది. ఇలాంటి నేపధ్యంలో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. కోసమెరుపు ఏమిటంటే.. మిస్టర్ టి నష్టపోయిన ఠాగూర్ మధునే మళ్లీ ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు టాక్. సో.. వైట్లపావు ఆయనకు నమ్మకం పోలేదన్నమాట.