డీజే పబ్లిక్ టాక్..

అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో పూజ హగ్దే హీరోయిన్ గా తెరకెక్కిన డీజే – దువ్వాడ జగన్నాథమ్ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి 2 తర్వాత తెలుగు లో వస్తున్న పెద్ద సినిమా కావడం, అదికూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ది కావడం తో మెగా అభిమానుల తో పాటు సినీ ప్రేక్షకులు డీజే ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు…మరి ఆ అంచనాలకు తగట్టు సినిమా ఉందా లేదా అనేది ఆడియన్స్ మాటల్లో చూద్దాం..

తెలుగు రాష్ట్రాల లో ఉదయం ఆట తో డీజే హంగామా మొదలయినప్పటికీ.. ఓవర్సీస్ లో మాత్రం అర్ధరాత్రి నుండే ప్రివ్యూ లతో డీజే హంగామా మొదలయ్యింది. కొద్దీ సేపటి క్రితం హైదరాబాద్ లోని ప్రసాద్స్ ఐ మాక్స్ లో మొదటి ఆట పూర్తి అయ్యింది. ఈ షో ను సినీ ప్రముఖులతో పాటు మెగా అభిమానులు వీక్షించడం జరిగింది..వారి మాటలు బట్టి చూస్తే..ఫస్ట్ హాఫ్ అంత ఫుల్ కామెడీ తో సాగిపోగా.. ఇంటర్వెల్‌కు ముందు 20 నిమిషాల నుంచి అసలు కథ లోకి వస్తుందట. ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులకు మరింతగా ఆసక్తి పెంచుందని అంటున్నారు. విజయవాడ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ‘అగ్రిడైమండ్’ లాండ్ స్కామ్‌పై అండర్ కవర్ పోలీస్‌గా బన్నీ కనిపిస్తాడని , తమవాళ్లకు సంబంధించిన భూములను లాక్కునేందుకు ప్రయత్నించిన వారిని ఏ విధంగా మట్టుపెట్టాడనేది అసలు కథట.. యాక్షన్ హీరో అర్జున్ నటించిన జెంటిల్ మెన్, ఎన్టీఆర్ నటించిన అదుర్స్ చిత్రాల మాదిరిగా ఉన్నాయి తప్ప ..కొత్తగా ఏమి లేదని అంటున్నారు..కాకపోతే మ్యూజిక్ , బన్నీ డాన్స్ లు , దిల్ రాజును నిర్మాణం బాగున్నాయని చెపుతున్నారు..ఇంతకీ సినిమా హిట్టా..ఫట్టా అనేది తెలియాలంటే మధ్యాహ్నం షో ముగిస్తే కానీ తెలియదు..