దిల్ రాజు భుజం ఫై బన్నీ చేయి వేసి ఏం చెప్పాడో తెలుసా..?

అల్లు అర్జున్ – దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం డీజే- దువ్వాడ జగన్నాధం..వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్య , పరుగు చిత్రాలు వచ్చి మెగా హిట్స్ అయ్యాయి..ఇప్పుడు డీజే తో యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు వీరిద్దరూ..ఇప్పటికే దేవి శ్రీ మ్యూజిక్ తో సినిమాకు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది..ట్రైలర్స్ , టీజర్స్ లలో బన్నీ యాక్టింగ్ , డాన్స్ , కామెడీ , డైలాగ్స్ ఇలా అన్ని కూడా అదరగొడుతుండడం తో సినిమా ఫై భారీ గా అంచనాలు పెరిగిపోయాయి.

తాజాగా అభిమానులతో లైవ్ చాట్ చేసిన అల్లు అర్జున్ ను యాంకర్ ఓ డీజే కు సంబదించిన వర్కింగ్ స్టిల్ చూపిస్తూ దిల్ రాజు తో ఏం మాట్లాడారని అడిగాడు..దానికి బన్నీ చెప్పిన ఆన్సర్ ఆశ్చర్యపరిచింది. ‘మనం ఎలాగైనా బాహుబలి రికార్డ్ కొడదాం అంటే.. తప్పుకుండా ట్రై చేద్దాం సార్’ రాజు గారు అన్నారంటూ నవ్వుకుంటూ సమాధానం చెప్పాడు. వాస్తవానికి బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే అది కుదిరే పని కాదు కానీ బాహుబలి పార్ట్ 1 రికార్డ్స్ ను బ్రేక్ చేసే అవకాశం డీజే కు ఉందని సినీ వర్గాలు అంటున్నారు..మరి బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి.