ఎన్నికల్లో పోటీ చేయాలి, బెయిల్‌ ఇవ్వండి

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ట్రెండ్‌ మార్చాడు. కోర్ట్‌ తనకు బెయిల్‌ మంజూరు చెయ్యాలంటూ అందుకు తను దేనికైనా రెడీ అంటూ కొత్త పద్ధతులు ఎంచుకున్నారు.

ఇన్నిరోజులుగా తాను ఓ ఎం సీ మైనింగ్‌ విషయంలో ఎలాంటి తప్పులూ చేయలేదంటూ వల్లిస్తూవచ్చిన గాలి వాటం ఇప్పుడు ఉన్నట్టుండి మారిపోయింది. తనకు బెయిల్ ఇవ్వాలని, తానుఎన్నికల్లో పోటీ చేయాలని కోర్టును కోరారు. కావాలంటే ఓఎంసి లో ఎంత నష్టం జరిగింతో చెబితే దానిని చెల్లించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు.

సిబిఐ చెబుతున్నట్లు ప్రభుత్వ ఖజానాకు ఓఎంసి వ్యవహారంలో నష్టం ఏమైనా వాటిల్లినట్లు తేలితేప్రభుత్వానికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి తాను సిద్ధంగా ఉన్నానని గాలి చెప్పారు. మరోఐదు నెలల్లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయని, తాను ఆ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉందని, అందుకు సహకరిస్తూ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. నాంపల్లిసిబిఐ కోర్టులో బుధవారం బెయిల్ కోరుతూ గాలి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై వాదనలుజరిగాయి. సిబిఐ న్యాయవాది వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో బెయిల్ కేసువిచారణను గురువారానికి వాయిదాపడింది.