నిత్యమీనన్ మనసు మార్చుకుంది


కెమెరా ముందున్న న‌టులైనా… సినిమాకి ప‌నిచేసే సాంకేతిక నిపుణులైనా – అందరి దృష్టీ మెగాఫోన్ మీదే. ఒక్కసారైనా కెప్టెన్ కుర్చీలో కూర్చుని యాక్షన్ – క‌ట్‌లు చెప్పాల‌నిపిస్తుంది. చాలా మంది ఆ ముచ్చట కూడా తీర్చుకొన్నారు. నిత్యామీనన్ కుడా ఈ కోరిక వుంది. గతంలోనే దర్శకత్వంపై తన మనసులో మాట బయటపెట్టింది.

అయితే ఇప్పుడు మనసు మార్చుకుంది నిత్యా. నటనలో తనకు ఇంకా పరిపూర్ణ సంతృప్తి కలగలేదని, చాలా వైవిధ్యమైన, రంజింపజేసే పాత్రల్లో నటించడానికి ఇష్టపడుతున్నానని వెల్లడించింది. దర్శకత్వం చేసే ఆశతో కొత్త సినిమాలను అంగీకరించడం లేదంటూ తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదనని, ఇప్పట్లో దర్శకత్వం చేసే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చేసింది నిత్యా.