టీజర్ టాక్ : ష్‌…. ‘స్పైడర్‌’


అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘స్పైడర్‌’ టీజర్‌ విడుదలైంది. ఓ హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఈ సినిమా టీజర్ ను కట్ చేశాడు దర్శకుడు మురగదాస్ . టీజర్ విషయానికి వస్తే.. ఓ రొబొటిక్‌ సాలీడు మహేశ్‌ బూట్లపై నుంచి భుజం వరకు పాకుతూ ఉంటుంది. అప్పుడు ఏదో పనిలో ఉన్న మహేశ్‌ పక్కకు తిరిగి ష్‌…. అని సౌండ్‌ చేయడంతో స్పైడర్‌ అక్కడే ఆగిపోతుంది. చెప్పడానికి ఇంతే అయినా టీజర్ చూస్తే మాత్రం వారెవ్వా అనాల్సిందే.

చిత్రానికి హారిస్‌ జైరాజ్‌ సంగీతం అందిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. . మహేష్ బాబుతో రకుల్ ప్రీత్ సింగ్ కు ఇదే తొలి సినిమా. నేషనల్ అవార్డ్ విన్నర్ సంతోష్ శివన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్నాడు. చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్‌, ఠాగూర్‌ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు వున్నాయి. ఇప్పుడీ టీజర్ అంచనాలను మరింత పెంచింది.