నాలుగు భాషలపై కన్నేసిన రానా


‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన రానా దగ్గుబాటి తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి. తేజ దర్శకుడు. ఈ సినిమాని నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రానికి ‘నేనే రాజు నేనే మంత్రి’ అని ప్రచారంలో ఉన్న టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తూ.. ఈ విషయాన్ని వెల్లడించాడు తేజ. బాహుబలి.. ఘాజీ లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా రానాకు మార్కెట్ పెరిగిన నేపథ్యంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను తెలుగుతో పాటు తమిళం.. హిందీ.. మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు తేజ తెలిపాడు.

ఈ చిత్రాన్ని రానా తండ్రి సురేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు.. కాజల్ హీరోయిన్. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానునుంది.