తిరుమలలో రైల్వేస్టేషన్….?

కేంద్ర రైల్వే మంత్రులు పవన్‌కుమార్‌ బన్సాల్‌, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి రైల్వే స్టేషన్‌ను అన్నివిధాల అభివృద్ధి పరుస్తామని తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన కేంద్ర రైల్వే మంత్రులు శ్రీవారి పుష్పయాగంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన రైల్వే సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. తిరుమలలో రైల్వే స్టేషన్‌ ఏర్పాటు చేసే విషయంపై  సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని ప్రకటించారు. అలాగే తిరుమలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలను కలుపుతూ మరిన్ని రైళ్లను నడపడానికి కృషిచేస్తున్నట్లు వివరించారు. తిరుపతి రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ సౌకర్యాలతో తాయారు చేయనున్నట్టు అప్పుడెప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే! అయితే ఇంతవరకు ఆదిశలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగిన దాఖలలేవి లేకపోవడం గమనార్హం.