మురుగదాస్‌కు అంత సీన్‌ లేదు

క్రేజీ దర్శకుడు మురుగదాస్‌ తమిళంలో ఎన్నో హిట్‌ చిత్రాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం మహేష్‌బాబు హీరోగా ‘స్పైడర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తెలుగులో కూడా ఈయనకు చాలా క్రేజ్‌ ఉంది. పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాడు. దాంతో మహేష్‌తో చేస్తున్న ‘స్పైడర్‌’ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత తమిళంలో విజయ్‌ హీరోగా మరో చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే మురుగదాస్‌, విజయ్‌ల కాంభోలో పలు సక్సెస్‌ చిత్రాలు వచ్చాయి. అంతకంటే మంచి కంటెంట్‌తో మరోసారి ఈ కాంభో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.

మురుగదాస్‌, విజయ్‌ల ఈ చిత్రాన్ని నిర్మించడానికి లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఆసక్తి కనబర్చింది. కానీ ఈ ప్రాజెక్ట్‌ నుండి సదరు సంస్థ తప్పుకుంది. మంచి కథ ఉండడంతో ఈ చిత్రాన్ని భారీగా ప్లాన్‌ చేశామని, అందుకు వంద కోట్ల బడ్జెట్‌ అవసరమని, వంద కోట్లను పెట్టాల్సిందిగా దర్శకుడు నిర్మాతతో అన్నాడట. మురుగదాస్‌ మీద నమ్మకంతో అంత బడ్జెట్‌ పెట్టడం కష్టమే, పైగా విజయ్‌కు కూడా ఇప్పుడు పెద్దగా సక్సెస్‌లు ఏమీ లేవు, ఎంతో మంచి టాక్‌ వస్తేనే వంద కోట్లు తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంది కానీ అదంటే భారీ నష్టలే వస్తాయి, కాబట్టి మురుగదాస్‌కు వంద కోట్ల బడ్జెట్‌ సీన్‌ లేదు అని లైకా సంస్థ తప్పుకుందట.