నయన్‌ బుట్టలో మరోటి పడినట్టే!

అందాలతార నయనతార ఏ పాత్రలో అయినా అలాగే జీవించిపోతుంది. అందుకే ఈ అమ్మడికి ఇంకా వరుస ఆఫర్‌లు వస్తూనే ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నయన్‌ కుర్రహీరోలతో రొమాన్స్‌ చేస్తూనే కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలలో నటిస్తోంది. తమిళంలో లేడి ఓరియెంటెడ్‌ చిత్రాలకు పెట్టింది పేరుగా నటిస్తోంది. పారితోషికం విషయంలో కూడా నయన్‌ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. నయన్‌ తాజా చిత్రం ‘ఇమైక్కా నోడిగల్‌’ విడుదలకు సిద్దం అవుతోంది. ఇటీవలె ఫస్ట్‌లుక్‌ విడుదయిన ఈ చిత్ర టీజర్‌ తాజాగా విడుదలయింది.

వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ కిల్లర్‌ను ఛేదించే సీబీఐ ఆఫీసర్‌గా నయన్‌ కనిపిస్తుంది. తాజాగా విడుదలైన టీజర్‌లో నయన్‌ పాత్ర అద్భుతంగా ఉంది. ముఖ్యమైన హత్యకేసుల్లోని కీలక ఘట్టాలను కట్‌ చేసి టీజర్‌ను రూపొందించారు. టీజర్‌ చూసిన వారికి సినిమాపై ఆసక్తిగా ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. కచ్చితంగా ఈ సినిమా మంచి హిట్‌ అవుతుంది, ఈ సక్సెస్‌తో నయన్‌ బుట్టలో మరోటి పడినట్టే అని అంటున్నారు. ఈ సినిమాతో నయన్‌ మరోసారి తన పవర్‌ఫుల్‌ నటనను చూపించబోతుంది అని అభిమానులు విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.