మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పల్లెటూరి సన్నివేశాలను నాచురాలిటీ కోసం గోదావరి పరిసర ప్రాంతాలలో తెరకెక్కించారు. తాజాగా హైద్రాబాద్‌లో షూటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే షూటింగ్ అనుకున్న సమయానికంటే కాస్త వెనుకబడి ఉంది. త్వరత్వరగా షూటింగ్ ముందుగా అనుకున్న సమయానికే పూర్తి చేయాలని చరణ్ ఇప్పటికే దర్శకుడు సుకుమార్‌కు తేల్చి చెప్పాడు. సహజంగా సుకుమార్ సినిమాలు ఎప్పుడూ ఆలస్యం అవుతూనే ఉంటాయి.
చరణ్ గట్టి వార్నింగ్ ఇవ్వడంతో ఈసారి కరెక్ట్‌గా అనుకున్న సమయానికే పూర్తి చేయాలని సుకుమార్ భావించాడు. కానీ నాలుగు రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన వడగాల్పులతో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు పైబడి నమోదవుతుంది. దాంతో ఈ ఎండ తీవ్రత ఇలా ఉండగా షూటింగ్ చేయడం యూనిట్‌కు మంచిది కాదు అని నిర్మాత దర్శకుడితో మాట్లాడి షూటింగ్‌కు స్వల్ప విరామం ఇచ్చారు. ఇటీవలె సమంతకు కూడా ఎండ దెబ్బ తగిలింది. అందుకే ఈ ఎండల్లో షూట్ చేయడం యూనిట్‌కే ప్రమాదం అని ఉన్నఫలంగా చెర్రీ సినిమాకి బ్రేక్ ఇచ్చారు.