సింగపూర్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

సింగపూర్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌తో బంధాన్ని మరింత బలోపేతం దిశగా కీలక ఒప్పందం చేసుకుంది. అమరావతిలో 1691 ఎకరాల స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్- ఏపీ ఎంవోయూ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పంద పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. అమరావతి అభివృద్థిలో సింగపూర్‌ భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో సింగపూర్‌ మాదిరిగా నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అమరావతి అభివృద్ధికి సింగపూర్‌ కేవలం 6 నెలల్లోనే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందన్నారు.