బళ్లారికి భారీగానే ముట్టజెప్పిన జక్కన్న

‘బాహుబలి’ చిత్రంతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రాజమౌళి భూటాన్‌ వెళ్లి అక్కడ ఓ వైపు ఎంజాయ్‌ చేస్తూ మరోవైపు ‘బాహుబలి 2’ చిత్రాన్ని ప్రమోట్‌ చేసి వచ్చాడు. తాజాగా హైద్రాబాద్‌ వచ్చిన రాజమౌళి తదుపరి చిత్రాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రాజమౌళి తనకు ఎంతో ఇష్టమైన నిర్మాతలలో ఒకరైన సాయి కొర్రపాటి కోసం బళ్లారికి వెళ్లాడు. నిర్మాత సాయికొర్రపాటి స్వస్థలమైన బళ్లారిలో స్వచ్ఛ భళ్లారి కార్యక్రమంలో రాజమౌళి పాల్గోన్నాడు. అంతేకాకుండా బళ్లారి కోసం ఏకంగా 6లక్షల రూపాయల విరాళం కూడా ఇచ్చాడు.

కర్నాటక వెళ్లిన రాజమౌళి అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాజమౌళి బాల్యంలో కూడా కొన్నాళ్లు బళ్లారిలో గడిచిపోయాయట. అందుకే రాజమౌళికి కన్నడ కూడా బాగాచే వచ్చు. ‘బాహుబలి’ విషయంలో కన్నడిగులు అతి చేస్త కన్నడలో వారు కరిగిపోయే విధంగా మాట్లాడి ఎట్టకేలకు కర్నాటకలో కూడా ‘బాహుబలి’ని విడుదల చేయడం రాజమౌళికే చెల్లింది. అక్కడ అభిమానులు రాజమౌళిని తదుపరి చిత్రం గురించి అడగగానే వెంటనే మాట మార్చాడు.