నాచురల్ స్టార్ నాని మంచి కథలను ఎంపిక చేసకుంటూ తనకు పరిపోయే కథలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. త్వరలో ‘నిన్ను కోరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతున్నాడు. నాని గత చిత్రం ‘నను లోకల్’ కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని సాధించి లాభాలను తెచ్చి పెట్టింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని చిత్రాల బిజినెస్ స్థాయి కూడా బాగా పెరిగిపోయింది.
నాని తాజా చిత్రం ‘నిన్ను కోరి’కి పెద్దగా పబ్లిసిటీ లేకున్నా కూడా ఏకంగా 20కోట్ల బిజినెస్ అయ్యిందట. అదంతా కూడా నాని వల్లనే జరిగిందని ట్రేడ్వర్గాల వారు అంటున్నారు. గతంలో నాని చిత్రాలకు 10 కోట్ల బిజినెస్ అయ్యేది కానీ వరుస హిట్ల వల్ల నాని చిత్రాలకు పెద్దగా ఫేం లేకున్నా కూడా కేవలం నాని వల్లనే భారీ రేంజ్లో బిజినెస్ జరుగుతోంది. నాని ‘నిన్ను కోరి’ చిత్రం కూడా విజయం సాధిస్తే ఇక నాని పెద్ద స్టార్ అయినట్టే అని సినీ ప్రముఖులు అంటున్నారు. అభిమానులు కూడా వావ్: నాని ఇక పెద్ద స్టార్ అయినట్టే అని తెగ సంబరపడిపోతున్నారు.