హెబ్బా నీ లక్‌ బాగుందబ్బా…

ముద్దుగుమ్మ హెబ్బాపటేల్‌కు విజయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ఆఫర్‌లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే చిన్న హీరోలందరి సరసన వరుపెట్టి నటిస్తున్న ఈ అమ్మడు ‘ఎక్కడకుపోతావు చిన్నవాడా’, ‘మిస్టర్‌’ వంటి మంచి హిట్‌లనే సొంతం చేసుకుంది. ఈ అమ్మడు నటించిన ‘అందగాడు’, ‘ఏంజెల్‌’ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. వరుస చిత్రాలతో చాలా బిజీగా ఉన్న ఈ అమ్మడికి తాజాగా మరో ఆఫర్‌ తగిలింది. రాజేష్‌ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం కాబోతున్న చిత్రంలో హీరోగా విజయ్‌ దేవరకొండ నటించనున్నాడు.

ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్‌లు కావలసి ఉన్నారు. వారిలో ఒకరిని తాజాగా హెబ్బా పటేల్‌ను ఎంపిక చేశారు. మరో హీరోయిన్‌ కోసం చిత్ర యూనిట్‌ గాలింపులు చేపట్టారు. చిన్న హీరోయిన్‌ మాత్రమే యూత్‌లో క్రేజ్‌ ఉన్న భామ అయితే బాగుంటుంది అని యూనిట్‌ హీరోయిన్‌లను ఎంపిక చేస్తున్నారు. హెబ్బా పటేల్‌ చిన్న హీరోయిన్‌ అంతేకాకుండా ఈ అమ్మడికి యూత్‌లో బోలెడంతా క్రేజ్‌ ఉంది. అందుకే ఈ అమ్మడిని వెంటనే సంప్రదించి ఒకే చేశారు. క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ సరసన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌ రొమాన్స్‌ చేయడానికి రెడీ అయ్యింది. దాంతో హెబ్బా.. నీ లక్‌ బాగుందబ్బా అని అభిమానులు అంటున్నారు.