బాహుబలి విజయం యావత్ భారతీయ సినీమార్కెట్నే మార్చేసింది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో దర్శకనిర్మాతలు భారీ చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా 500 కోట్ల బడ్జెట్తో రామాయణంను తెరకెక్కించడానికి నిర్మాత అల్లు అరవింద్ సిద్దం అవుతున్నారని, ఇందులో రాముడిగా రామ్ చరణ్ కనిపిస్తాడని వార్త వచ్చింది.
ఇప్పుడు సినిమాకి సంబంధించి ఓ అభిమాని తన ఊహలకి డిజైన్ రూపమిచ్చి సోషల్ మీడియాలో వదిలేశాడు. ఇందులో రామ్చరణ్, రాముడిగా కన్పిస్తున్నాడు. ఈ డిజైన్ సూపర్ గా వుంది. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన లేకుండానే అప్పుడే అభిమానులు తమ ఊహలకు పని చెబుతున్నారు. ప్రస్తుతం చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.