కిరణ్, బొత్సలపై కిషోర్ చంద్రదేవ్ ఫిర్యాదు

సీఎం, పీసీసీ అధ్యక్షుడి పనితీరుపై, రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితులను వివరిస్తూ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ అధిష్టానానికి లేఖ రాశారు. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ కన్నా ముందే… అధిష్టానానికి కిషోర్ తన అభిమాతాన్ని లేఖ ద్వారా తెలియజేశారు. ఈ విషయంపై అధికారికంగా స్పందించేందుకు చంద్రదేవ్ నిరాకరిస్తున్నప్పటికినీ, మొత్తం ౧౧ పేజిల్లో అభిప్రాయాన్ని అధిష్టానానికి పంపినట్లు సమాచారం. ఈ లేఖలో ప్రధానంగా బొత్సను మైనింగ్ మాఫియాగా…పాలనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమర్ రెడ్డి పట్టు లేదన్న అభిప్రాయాన్ని కిషోర్ చంద్రదేవ్ వ్యక్తం చేశారు. ప్రతి అవినీతిలోనూ బొత్స సత్యనారాయణకు భాగముందనీ, మద్యం, గనులు, భూ కుంభకోణాలను మాఫియా సూత్రధారి బొత్సేనని వివరణ. సీఎం కిరణ్ సహచరమంత్రుల నుంచే గౌరవం పొందలేక పోతున్నారనీ, అధికార యంత్రాంగాన్ని సీఎం సమర్థంగా నడిపించలేకపోతున్నారనీ, ముఖ్యమంత్రి ఆత్మనూన్యత భావంతో బాధపడుతున్నారని లేఖలో పేర్కొన్న చంద్రదేవ్. ఈ లేఖలో ద్వారా ప్రధానంగా బొత్స, కిరణ్ లను వెంటనే మార్చాలనే అభిప్రాయాన్ని కిషోర్ చంద్రదేవ్ వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.