గోవాలో హల్‌చల్‌ చేస్తున్న సూపర్‌స్టార్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం క్రేజీ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో ‘స్పైడర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే పూర్తి కావాల్సింది కానీ కొన్ని సన్నివేశాలను రీషూట్‌ చేయడం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. దాంతో ముందుగా అనుకున్న విడుదల తేదీ మారిపోయింది. పాటలు, క్లైమాక్స్‌ సన్నివేశాల వల్ల షూటింగ్‌ ఇంకా చాలా ఆలస్యం అవుతుంది. దాంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక చిత్ర యూనిట్‌ చేసేది లేక మహేష్‌ పుట్టిన రోజు సందర్భంగా అగస్టు 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అని ప్రకటించారు కానీ అది కూడా అనుమానంగానే ఉంది.

ప్రస్తుతం ‘స్పైడర్‌’ షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చి మహేష్‌బాబు కుటుంబ సమేతంగా గోవా చేరుకున్నాడు. వేసవిలో ఎంజాయ్‌ చేయడానికి ఫ్యామిలితో కలిసి గోవాలో హల్‌చల్‌ చేస్తున్నాడు. కొన్ని రోజుల పాటు గోవాలోనే ఎంజాయ్‌ చేసి ఆ తర్వాత మళ్లీ ‘స్పైడర్‌’ షూటింగ్‌లో పాల్గోననున్నాడు. గోవాలో ఎంజాయ్‌ చేస్తున్న సూపర్‌స్టార్‌ ఫ్యామిలీ ఫొటోస్‌ మీకోసం…