పవన్‌ తర్వాతి చిత్రానికి బడ్జెట్‌ ఎంతో తెలిస్తే షాకవుతారు

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అంటే టాలీవుడ్‌ ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతారు. పవన్‌ బడ్జెట్‌ ఎలా ఉన్నా కూడా ఈయన పాపులారిటీతోనే భారీ సక్సెస్‌లను సొంతం చేసుకుంటాడు. అలాంటి పవన్‌ ఇటీవల వరుసగా ఫ్లాపవుతూ వస్తున్నాడు. గత మూడు చిత్రాలు కూడా పవన్‌కు నిరాశే మిగిల్చాయి. అయినా కూడా పవన్‌ తదుపరి చిత్రంపై అంచనాలు మాత్రం తారా స్థాయిలోనే ఉన్నాయి. పవన్‌ తాజాగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్‌ సరసన కీర్తి సురేష్‌ మరియు అనూ ఇమాన్యుయెల్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

పవన్‌, త్రివిక్రమ్‌ కాంభోలో ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యాయి. దాంతో ఈ చిత్రంపై కూడా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని పవన్‌ కసరత్తులు చేస్తున్నాడు. ఎక్కడా కూడా చిన్న లోపం జరగకుండా ఉండాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి ఏకంగా వంద కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. ఒక కమర్షియల్‌ చిత్రానికి వంద కోట్లకు పైగా బడ్జెట్‌ అంటే చాలా ఎక్కువ, కానీ పవన్‌, త్రివిక్రమ్‌ల స్టాటజీ వల్ల ఈ చిత్రానికి వంద కోట్లను కేటాయిస్తున్నారు. పవన్‌ చిత్రానికి వంద కోట్ల బడ్జెట్‌ అనగానే సినీ విశ్లేషకులు షాకవుతున్నారు.